Urvashi Rautela Counter To Cricketer Rishabh Pant Over His Comments, Details Inside - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: పంత్‌కు రీకౌంటర్‌ ఇచ్చిన ఊర్వశి, ‘కౌగర్‌ హంటర్‌’ అంటూ ఘాటు వ్యాఖ్యలు

Published Fri, Aug 12 2022 11:25 AM | Last Updated on Fri, Aug 12 2022 12:42 PM

Urvashi Rautela Hot Back to Cricketer Rishabh Pant Over His Comments - Sakshi

బాలీవుడ్‌ ఊర్వశి రౌతేలా, యంగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌లు సోషల్‌ మీడియా వేదికగా మాటల దాడికి దిగారు. ఓ ఇంటర్య్వూలో ఊర్వశి చేసి కామెంట్స్‌పై రీసెంట్‌గా పంత్‌ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పంత్‌ వ్యాఖ్యలను తిప్పికొడుతూ అతడికి రీకౌంటర్‌గా ఓ పోస్ట్‌ వదిలింది ఊర్వశి. అసలేం జరిగిందంటే గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్‌ పంత్‌ ఎయిర్‌ పోర్ట్‌లో గంటల తరబడి వేచి చూశాడని, వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఊర్వశి తన కోసం ఆర్‌పీ(RP) అనే వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లో గంటల తరబడి వేచి చూశాడని చెప్పింది.

చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్‌ కన్నుమూత

అయితే తను షూటింగ్‌కు వెళ్లి అలసిపోవడం వల్ల జర్నీలో పడుకుండిపోయానంది. లేచి చూసేసరికి అతని నుంచి 16 నుంచి 17 మిస్డ్‌ కాల్స్ వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్‌పీ ఎవరని అడగ్గా తాను పేరు చెప్పలేనని తెలిపింది. దీంతో అందరు అది రిషబ్‌ పంత్‌ అని అభిప్రాయపడ్డారు. ఇక ఊర్వశి కామెంట్స్‌ వైరల్‌ కావడంతో రిషబ్‌ స్పందిస్తూ ఆమె పేరు ప్రస్తావించకుండానే తనపై కామెంట్స్‌ను తిప్పి కొట్టాడు. కొంతమంది ఫేమ్‌ కోసం అబద్ధాలు ఎలా అడతారో అర్థం కాదని, వారి స్వలాభం కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తారన్నాడు. అంతేకాదు ప్లీజ్‌అక్క నన్ను వదిలేయంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో ఊర్వశికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు.

చదవండి: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్‌కు వెళ్లింది!: నాగార్జున

ఇక రిషబ్‌ పోస్ట్‌పై ఊర్వశి రౌతేలా మండిపడింది. అంతేకాదు పరోక్షంగా పంత్‌ను కౌగర్‌ హంటర్‌(తన కంటే ఎక్కువ వయసున్న అందమైన అమ్మాయిలతో లైంగిక సంబంధం కోరుకునే పురుషుడు)గా అంటూ పంత్‌కు చురకలు అంటించింది. ఈ మేరకు గురువారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘చొటా భయ్యా నువ్వు బ్యాట్‌ బాల్‌తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఈ పోస్ట్‌కు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు, ఆర్‌పీ భాటుభయ్యా, కౌగర్‌ హంటర్‌, డోంట్‌ టేక్‌ అడ్వాంటేజ్‌ ఆఫ్‌ ఏ సైలెంట్‌ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీంతో ఊర్వశి పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement