బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ కొద్దిరోజుల క్రితం బెదిరింపు మెసేజ్ పెట్టిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన షేక్ హుస్సేన్ (24)గా గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హుస్సేన్ కూడా అదే గ్యాంగ్‌కు సంబంధించిన వ్యక్తి అంటూ సల్మాన్ నుంచి రూ. కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ చేశాడు.
సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే తాను ఇలాంటి ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ అతన్ని పూర్తిగా విచారించిన తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు.
ముంబయి ట్రాఫిక్ పోలీసులకు కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అయితే, ఒకరోజు తర్వాత అతను మరో సందేశం ఇలా పంపించాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జంషెడ్‌పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment