
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు మిథిలేష్ చతుర్వేది(67) కన్నుమూశారు. నేడు(ఆగస్ట్ 3న) గురువారం ఉదయం ఆయన గుండెపోటుతో లక్నోలోని తన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లండించారు. చతుర్వేది హఠాన్మరణంతో బాలీవుడ్‌లో విషాద చాయలు నెలకొన్నాయి.
చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్
దీంతో బాలీవుడ్ సినీ,టీవీ నటినటులు ఆయన మృతిపై దిగ్భ్రాంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా కోయి మిల్ గయా, ఆశోక, గదర్ ఏక్ ప్రేమ్ కథ, బంటీ జౌర్ బబ్లీ, క్రిష్, రెడీ, ఆజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, సత్య వంటి ఎన్నో హిట్ చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌తో పాటు ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటించారు.
Comments
Please login to add a commentAdd a comment