Sherni First Look: Fearless Forest Officer, Vidya Balan Shares New Poster, Movie To Release In June - Sakshi
Sakshi News home page

షేర్నీ: అటవీ శాఖాధికారిణిగా విద్యాబాలన్‌

Published Tue, May 18 2021 6:43 AM | Last Updated on Tue, May 18 2021 9:22 AM

Vidya Balan shares first look as forest officer from Sherni - Sakshi

విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘షేర్నీ’. ‘న్యూటన్‌’ ఫేమ్‌ అమిత్‌ మసుర్‌కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విద్యాబాలన్‌ విడుదల చేసి, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. జూన్‌లో ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో విద్యాబాలన్‌ నిజాయతీ గల అటవీ శాఖాధికారి షేర్నీ పాత్ర చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... విద్యాబాలన్‌ నటించిన గత చిత్రం ‘శకుంతలా దేవి’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement