రామ్‌చరణ్‌ను కలిశా.. ఏం మాట్లాడానో అడగొద్దు: విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Says He Met Ram Charan Recently But Not Revealed Conversation | Sakshi
Sakshi News home page

Vishwak Sen: విశ్వక్‌ ఆడిషన్‌ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరోగా..

Published Fri, Feb 16 2024 11:43 AM | Last Updated on Fri, Feb 16 2024 11:52 AM

Vishwak Sen Says He Met Ram Charan Recently But Not Revealed Conversation - Sakshi

ఎన్నో ఆఫీసులు గేటు దాటి కూడా లోపలికి వెళ్లలేకపోయాను.. అవన్నీ చెప్పి సింపతీ కార్డ్‌ వాడుకోవచ్చు. కానీ నాకది నచ్చదు.

ఏ దాపరికమూ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే హీరోల్లో ముందువరుసలో ఉంటాడు విశ్వక్‌ సేన్‌. మాస్‌ కా దాస్‌ అన్న ట్యాగ్‌లైన్‌ అతడికి ఊరికే రాలేదు. సినిమాల్లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లో కూడా మాస్‌ లుక్‌లోనే కనిపిస్తాడు విశ్వక్‌. తన మాటలు కూడా అలాగే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకునే ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నాడు.

ఆ సినిమాకు ఫస్ట్‌ ఆడిషన్‌!
విశ్వక్‌ మాట్లాడుతూ.. 'జనాలు నన్ను చూసి సేమ్‌ హీరోలాగా ఉన్నావ్‌రా అనేవారు. నేనది సీరియస్‌గా తీసుకున్నా, సినిమాల్లోకి వచ్చాను. నేను ఆడిషన్‌కు వెళ్లిన తొలి చిత్రం జోష్‌. దిల్‌ రాజు జోష్‌ సినిమా కోసం కొత్తవాళ్లను తీసుకుంటున్నానని టీవీలో చెప్తే అది చూసి ఆడిషన్‌కు వెళ్లాను. కానీ అది వర్కవుట్‌ కాలేదు. ఎన్నో ఆఫీసులు గేటు దాటి కూడా లోపలికి వెళ్లలేకపోయాను.. అవన్నీ చెప్పి సింపతీ కార్డ్‌ వాడుకోవచ్చు. కానీ నాకది నచ్చదు.

ఎవరికీ తెలీదు
ఒక డైరెక్టర్‌ నా గురించి మీడియా ముందు కంప్లైంట్‌ చేశాడు. ఆయన నా ఇంటికి కూడా వచ్చాడు. ఇంకా చాలా జరిగింది. అదంతా ఎవరికీ తెలీదు. అయినా ఏ గొడవపైనా స్పందించవద్దని నిర్ణయించుకున్నాను. సైలెంట్‌గా ఉండటమే మంచిదనిపిస్తోంది. చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ రెమ్యునరేషన్‌ కోసం సినిమాలు చేయను. ఈ మధ్యే రామ్‌చరణ్‌ను కలిశాను. ఏం మాట్లాడారని అడగొద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నకు ఏ నటుడూ సమాధానం చెప్పడు' అని నవ్వేశాడు విశ్వక్‌ సేన్‌.

చదవండి: OTT: 9 నెలల తర్వాత ఓటీటీలో రిలీజైన వివాదాస్పద సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement