Mirzapur 2 Release Date Announced | Amazon Prime Video 'Telugu' Web Series - Sakshi
Sakshi News home page

‘మీర్జాపూర్‌-2’ రిలీజ్‌ ఎప్పుడంటే..

Published Mon, Aug 24 2020 1:17 PM | Last Updated on Mon, Aug 24 2020 2:02 PM

Web Series Mirzapur 2- Release Date Announcement  - Sakshi

ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 2’ విడుదల తేదిని  అమెజాన్‌ ప్రైమ్ వీడియో‌ అధికారికంగా ప్రకటిచింది. ఈ మేరకు సోమవారం ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో అక్టోబర్‌ 23న మీర్జాపూర్‌-2 ను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే విడుదలైన మీర్జాపూర్‌ మొదటి సీజన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. అప్పటి నుండి సెకండ్ సీజన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఓ వీడియోను షేర్‌ చేసిన విషయం తెలిసిందే. వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ సీక్వెల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. అయితే షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న మీర్జాపూర్‌-2 కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. (మరోసారి బోల్డ్‌ పాత్రలో...)

మిర్జాపూర్.. ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది డ్రగ్స్, గన్స్ ,అన్యాయం చుట్టూ తిరుగుతుంది. మాఫియా డాన్స్ పాలన, ఉత్తర ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న శత్రుత్వం, నేరాలను చూపిస్తుంది. ఈ సిరీస్ మొదటి సీజన్‌లో అలీ ఫజల్, విక్రాంత్ మాస్సే, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్గావ్కర్, రసిక దుగల్, హర్షితా గౌర్, దివియేండు శర్మ, కుల్భూషణ్ ఖర్బండా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌పై అలీ ఫజల్‌ ఇటీవల మాట్లాడుతూ. రెండో సిరీస్‌ లాక్‌డౌన్‌ వల్ల‌ ఆలస్యం అయ్యిందన్నారు. ప్రస్తుతం అభిమనులు దీని కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ‘మీర్జాపూర్‌ 2’ వారి అంచనాలకు చేరుతుందని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. ఈ సిరీస్‌ అమెజాన్‌లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందన్నారు.('ఐ ల‌వ్ యూ చెప్పేందుకు 3 నెల‌లు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement