షకలక శంకర్, ప్రభు
షకలక శంకర్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘రాంగ్ గోపాల్‌వర్మ’. ప్రముఖ పాత్రికేయుడు ప్రభు స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు, షకలక శంకర్, అభి, ర్యాప్‌రాక్ షకీల్, బాబు, పాత్రికేయులు వినాయకరావు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్‌గా పలు సంచలనాలు సృష్టించిన ప్రభు ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చిత్రంతో దర్శకునిగానూ సంచలనాలు సృష్టించాలని వినాయకరావు, సురేశ్ ఆకాక్షించారు.
ఇప్పటివరకు తాను నటించిన చిత్రాలన్నింటిలోకి తనకు బాగా న చ్చిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’’ అన్నారు షకలక శంకర్. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాత ప్రభుకు కృతజ్ఞతలు అన్నారు కెమెరామెన్ బాబు, సంగీత దర్శకుడు షకీల్. ప్రభు మాట్లాడుతూ– ‘‘ఒక దర్శకుని వింత పోకడలకు, వెర్రి చేష్టలకు విసిగిపోయి వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చిత్రాన్ని తెరకెక్కించాను. మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్, టీజర్‌కు చక్కని పేరొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment