KGF Yash and Radhika Pandit Starrer Raraju Movie Going To Be Release in Telugu - Sakshi
Sakshi News home page

Yash: భార్యతో యశ్‌ కలిసి నటించిన సినిమా.. ఇప్పుడు తెలుగులో

Published Mon, May 9 2022 8:14 AM | Last Updated on Mon, May 9 2022 8:54 AM

Yash And Radhika Pandit Raraju Movie Going To Release In Telugu - Sakshi

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్‌ రావు దర్శకత్వంలో యశ్, రాధికా పండిట్‌ జంటగా నటించిన చిత్రం ‘సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌’. కె.మంజు నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు ‘రారాజు’ పేరుతో పద్మావతి పిక్చర్స్‌ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్‌.సుబ్బారావు మాట్లాడుతూ– ‘‘యశ్, ఆయన సతీమణి రాధికా పండిట్‌ జంటగా నటించిన ఈ చిత్రం కన్నడలో మంచి హిట్‌ అయ్యింది.

ఈ మూవీని ‘రారాజు’ పేరుతో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం. ట్రైలర్‌ని త్వరలో విడుదల చేస్తాం. ఈ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘కిక్‌’ శ్యామ్, సీత, రవిశంకర్‌ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరికృష్ణ, కెమెరా: ఆండ్రూ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement