త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన

Published Sun, Feb 16 2025 1:16 AM | Last Updated on Sun, Feb 16 2025 1:15 AM

త్రీఫ

త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన

వాజేడు : తమ కాలనీకి త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని కోరుతూ పెనుగోలు కాలనీ ఆదివాసీలు శనివారం ఆందోళన చేపట్టారు. నిరంతరం విద్యుత్‌ లైట్లు వెలిగేలా చూడాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపినా విద్యుత్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మండల కేంద్రంలోని జంగాలపల్లి గ్రామం వరకు త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ వేసి తమ కాలనీకి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జంగాలపల్లి వరకే త్రీఫేజ్‌ లైన్‌ వచ్చిందని పెనుగోలు కాలనీకి త్రీఫేజ్‌ లైన్‌ మంజూరు కాగానే లైన్‌ వేస్తామని రాజేందర్‌ వారికి తెలిపారు.

బంజారాల ఆరాధ్యుడు సేవాలాల్‌

ములుగు : సద్గురు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ బంజారాల ఆరాధ్యదైవం అని సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పోరిక శ్రవణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో సేవాలాల్‌ 286 జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్టీయూ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్‌ హాజరై బంజారాలకు శుభాకాంక్షలు తెలిపారు. పాల్తీయ సారయ్య, సోమా, జయరాం, కసన్‌సింగ్‌, కుమార్‌ పాడ్య, రవి, సర్దార్‌ సింగ్‌, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

బీజేపీ ఉపాధ్యాయ

ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా..

ములుగు రూరల్‌ : బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పులి సరోత్తం రెడ్డి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి సూచించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రేమేందర్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని జిల్లాలోని ప్రతీ ఓటరు ఉపాధ్యాయులను అభ్యర్థించాలని, గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. నియోజకవర్గ కన్వీనర్‌ వెన్నెంపల్లి పాపన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కృష్ణవేణి నాయక్‌, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్‌, ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్‌ కొత్త సుధాకర్‌ రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి శ్రీమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షు డు కృష్ణాకర్‌ రావు, నాయకులు పాల్గొన్నారు.

అంతిమయాత్రకు అరిగోస

దహన సంస్కారాలకు వెళ్లేందుకు దారి ఏది?

వెంకటాపురం(కె) : మండలంలోని ఉప్పెడువీరాపురం పంచాయతీ పరిధిలోని వెంగళరావుపేటలో ఎవరైనా మృతిచెందితే అంతిమయాత్ర చేసేందుకు దారి లేక అరిగోస పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇసుక పాయకు వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు మార్గం (దారి) ఏర్పాటు గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి చెందిన మాదాల రాంబాబు శనివారం మృతిచెందగా అంత్యక్రియలు నిర్వహించేందుకు దారిలేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేందుకు గ్రామస్తులు వాపోయారు. 30ఏళ్ల నుంచి గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇసుక పాయకు తీసుకు వెళ్లేందుకు ఉన్న దారిని మూసేసి మిర్చి పంటలు సాగుచేస్తున్నారు. దీంతో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని ఆరోపించారు. దళిత కుటుంబాలు ఉండే గ్రామం నుంచి చాలా వెడల్పుతో దారి ఉండేదని ప్రస్తుతం కనీసం నడిచి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు వెంటనే స్పందించి గతంలో ఉన్న విధంగా రోడ్డును ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన
1
1/2

త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన

త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన
2
2/2

త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఇవ్వాలని ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement