సమస్యలపై పోరాడే వ్యక్తిని గెలిపించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే వ్యక్తి పులి సరోత్తంరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడే నగేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శాసన మండలి ఎన్నికలపై ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వరంగల్–ఖమ్మం–నల్లగొండ బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘ కాలంగా ఆయన పోరాటం చేస్తన్నారని తెలిపారు. సరోత్తం రెడ్డి గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు సరోత్తం రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, విశ్వనాథ్, రాజ్‌కుమార్, నాగరాజు, దేవేందర్‌రావు, రవిరెడ్డి, రాకేష్‌యాదవ్, సురేష్, రాకేష్‌రెడ్డి, టీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాటాల్డారు. ఎమ్మెల్సీగా సరోత్తం రెడ్డికి ఉపాధ్యాయులు ఓటువేసి గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప ల్లా బుచ్చయ్య, సురేందర్, రవీందర్, జనార్ధన్, స మ్మక్క, సంగీత, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎంపీ గోడే నగేశ్
వనదేవతలకు పూజలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి విజయం సాధించేలా సమ్మక్క సారలమ్మలు దీవించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పక్షాన ప్రచారం చేసేందుకు జిల్లాకు వచ్చిన సందర్భంగా సరోత్తంరెడ్డితో కలిసి అయన మంగళవారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజాలు చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment