నాణ్యమైన విద్యుత్ సరఫరా
భూపాలపల్లి రూరల్: వేసవి కాలం సమీస్తున్న దృష్ట్యా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ముందస్తు కార్యచరణ చర్యలు చేపట్టామని ఎస్‌ఈ మల్చూరు నాయక్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం ట్రాన్స్‌ఫర్మర్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడారు. వేసవిలో ఎటువంటి అంతరాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టంచేశారు. ఎస్‌ఈ వెంట డీఈ పాపిరెడ్డి, డివిజన్ అధికారులు ఉన్నారు.
ఎస్‌ఈ మల్చూరు నాయక్
Comments
Please login to add a commentAdd a comment