తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి
ములుగు: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడిపై సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మండలాల వారీగా ఉన్న పైపులైన్లు, వాటి స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు నీటి కొరత లేకుండా ఎదురుకాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజూ నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా పైపులైన్లు లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో నీటి వనరుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు స్థానిక అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. గతేడాది జిల్లాలో నీటి సమస్య ఎదురైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా సమస్య పరిష్కారానికి ముద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. పైపులైన్ల ద్వారా నీటిని అందించలేని పక్షంలో ఆ గ్రామాలకు, కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు(స్థానిక సంస్థలు), ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేశం, ఈఈ సుభాష్, డీపీఓ దేవరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment