వాహనాలకు అటవీశాఖ ఫాస్టాగ్
ఏటూరునాగారం: రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో ఫాస్టాగ్ తరహాలో వాహనాలకు అటవీశాఖ ఆధ్వర్యంలో రుసుం వసూలు చేసే కా ర్యక్రమానికి శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి(ఎఫ్‌డీఓ) రమేశ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఫాస్టాగ్ తరహాలో వాహనాలకు ఆటోమెటిక్‌గా రుసుం చె ల్లించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపా రు. ఏటూరునాగారం, పస్రా, తాడ్వాయి ప్రాంతా ల్లో ఈ తరహా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా ఏటూరునాగారంలో శుక్రవారం అటవీశాఖ ఫాస్టాగ్‌ను ట్రయల్ రన్ చేపట్టి రుసుం వసూలు చేశారు. గూడ్స్ వాహనాలకు రూ.200, కార్లకు రూ.50, ఇతర వాహనాలకు వేర్వేరుగా రుసుం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్‌గా వాహనదారుడి ఖాతాల నుంచి అటవీశాఖ ఖాతాలోకి జమకావడం రాష్ట్రంలో మొదటిసారి ములుగు జిల్లాలో చేపట్టడం విశేషం.
ట్రయల్ రన్ నిర్వహించిన ఎఫ్‌డీఓ రమేశ్
జిల్లాలో మూడు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment