ములుగు: వన్యప్రాణాల వేట కోసం కరెంట్ తీగలు అమర్చి వాటికి హాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా తీగలు అమర్చిన ట్లు సమాచారం అందిస్తే నగదు బహుమానం ఇస్తామని చేసిన ప్రకటనకు మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ శివారులో, 19వ తేదీ న కుమ్మరిపల్లి శివారులోని పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చినట్లు సమాచారం అందుకొని ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సమాచారం అందించిన వారికి రూ.5 వేల చొప్పున రివార్డు అందించామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గతంలో విద్యుత్ తీగలు అమర్చిన వారిని గ్రామాల వారీగా గుర్తించి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్‌రావులను ఎస్పీ అభినందించారు.
ఎస్పీ డాక్టర్ శబరీష్
Comments
Please login to add a commentAdd a comment