సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యం
● గరికపాటి మోహన్‌రావు
ములుగు రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, టీపీయూ బలపరిచిన వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. గతంలో గెలిసిన ఎమ్మెల్సీలు స్వార్ధప్రయోజనాలకు అధికార పార్టీలలో చేరి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్ని కైన బలరాంను సన్మానించారు. నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ విజయచందర్‌రెడ్డి, వెన్నంపల్లి పాపన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్‌రెడ్డి, అజ్మీరా కృష్ణవేణినాయక్, కొత్త సురేందర్, బలరాం, జవహార్‌లాల్, రవీంద్రాచారి, కృష్ణాకర్, రవీందర్‌రెడ్డి, స్వరూప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment