పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ అటవీగ్రామంలో పోడు చేస్తున్నారన్న సమాచారంతో గురువారం డీఆర్‌ఓ ఉషారాణి ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు, సిబ్బంది రైతుల ను అడ్డుకున్నారు. దీంతో రైతులకు, ఫారెస్టు అధి కారుల మధ్య జరిగిన తోపులాటలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఫారెస్టు అధికారులు రైతులపై దాడులు చేశారని, ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలయ్యాయని, లంచం ఇవ్వకుంటే దాడులు చేయించిందని ఆరోపిస్తూ.. అధికారిణిపై గురువారం భూ పాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రైతులు చేశారు. విధులకు అటంకం కలిగించారని రైతులపై ఫారెస్టు అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం..
రైతులు ఏమంటున్నారంటే..
‘మేము 10 కుటుంబాలకు చెందిన వారము. గత 30ఎళ్లుగా ఆజాంనగర్‌లో పోడు వ్యవసాయంమీద బతుకుతున్నాం. గతేడాది జూన్ మాసంలో అధికారిణి సాగు అడ్డుకుందని, దీంతో 10 మంది రైతులం కుటుంబానికి రూ. 50వేల చొప్పున రూ. 5లక్షలు లంచం ఇవ్వడంతో పత్తి పంటసాగుకు అనుమతి ఇచ్చింది’ అని రైతులు ఆరోపించారు. ఈ ఏడాది మరో రూ.2లక్షలు కావాలని అడిగిందని, ఇవ్వకపోవడంతో సిబ్బందితో జేసీబీలతో గుంతలు చేయడానికి భూముల మీదకు రావడంతో అడ్డుకున్నామని, అధికారులు, సిబ్బంది ఇస్టానుసారంగా తమపై దాడులు చేసి ముగ్గురిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆరోపణల్లో నిజం లేదు..
రైతుల దాడిలో ఫారెస్టు అధికారుల జీపు అద్దం ధ్వంసమైందని, ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయని, ఆరుగురు రైతులపై ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. లంచం తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, తప్పుడు ఫిర్యాదు చేయించారని అధికారిణి ఉషారాణి తెలిపారు.
పోలీస్‌స్టేషన్‌కు ముగ్గురు రైతుల
తరలింపు
లంచం తీసుకున్నారని అధికారిణిపై పోలీసులకు రైతుల ఫిర్యాదు
పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు
పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు
Comments
Please login to add a commentAdd a comment