పనులను పరిశీలించిన కలెక్టర్
కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించిన క్రమంలో కలెక్టర్ టీఎస్.దివాకర 2024 జూన్ 20న సందర్శించారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కరకట్ట నిర్మాణం పూర్తయితే ఒడ్డు వెంట ఉన్న సాగు భూములు కోతకు గురికాకుండా ఉండడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతం వెంట ఉన్న లోతట్టు వరద ముంపు గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. కరకట్ట నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ను దిగుమతి చేసుకుని నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కరకట్ట పనులను మంత్రి సీతక్క చేత అధికారికంగా ప్రారంభించేందుకు శిలాఫలకం వంటి తదితర ఏర్పాట్లు చేశారు. అనంతరం వర్షాల కారణంగా అంతటితో పనులు నిలిచిపోయాయి. ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా నేటి వరకు ఆ పనుల గురించి పట్టించుకున్న వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment