ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి
వాజేడు/గోవిందరావుపేట: ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అకాడమి మానిటరింగ్ అధికారి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల ఉపాధ్యాయులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ట్రైనింగ్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. రానున్న కాలంలో ఇంటర్నెట్ ప్రభావం మరింత పెరిగి దానికి అనుగుణంగా పనులు జరుగుతాయన్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ శిక్షణలో ఇచ్చే సూచనలు పాటించి విద్యార్థులకు బోధిస్తే మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఎంఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాట్ ప్యానెల్ గురించి తెలుసుకొని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు, హిందీ రీసోర్స్ పర్సన్స్ స్వరూప్ సింగ్, జాకీర్ అలి లఖావత్ బాలాజీ, అశోక్, రమేష్, సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అథిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా ఈ విషయాన్ని గుర్తించి నూతన సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గొంది దివాకర్, శ్యాంసుందర్ రెడ్డి, షేక్ హాజీ నూరానీ, పాడ్య రవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అకడమిక్
మానిటరింగ్ అధికారి మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment