నేడు తిరుగువారం పండుగ
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి తిరుగువారం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి.
సాంకేతిక విజ్ఞానాన్ని
పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని పీఎం ఎస్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ లక్ష్మణ్ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది మంగళవారం హనుమకొండలోని ఎన్‌ఐటీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య, శాసీ్త్రయ విద్య పెంపొందించేందుకు స్టెమ్ సంస్థ ద్వారా స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ టూర్‌లో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లయ్య, రాజు, రజిని, రజిత పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాలపై
అప్రమత్తం
ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సర్కిల్ డీఈఈ(టెక్నికల్) వెంకటేశం, ములుగు డీఈఈ నాగేశ్వర్‌రావులు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జగ్గన్నపేట రైతులకు మంగళవారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కెపాసిటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బానోత్ రవి, ఏఎల్‌ఎం కమలాకర్, రైతులు పాల్గొన్నారు.
‘పది’ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
వెంకటాపురం(కె): పదో తరగతి విద్యార్థులు ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏటీడీఓ క్షేత్రయ్య ఉపాధ్యాయులకు సూచించారు. మండల పరిధిలోని చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉన్న ఉపాధ్యాయులు, సిలబస్ పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆశ్రమపాఠశాల సందర్శన
వాజేడు: మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్‌లోని వంటశాలను పరిశీలించి పలు సూచనలను చేశారు. దోమలు లోపలికి రాకుండా కిటికీలకు జాలీలను ఏర్పాటు చేయడంతో పాటు దోమ తెరలను వాడాలని సూచించారు. విద్యార్థుల సిక్ రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేరూరులోని సోయం వినీత్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించి విద్యార్ధి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం వాజేడు వైద్యశాలను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు.
నేడు తిరుగువారం పండుగ
నేడు తిరుగువారం పండుగ
నేడు తిరుగువారం పండుగ
Comments
Please login to add a commentAdd a comment