ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడి
మాకు ఇదే జీవనాధారం
నేను మా పూర్వీకుల నుంచి గజ్జల లాగుపోయడమే వృత్తిగా ఎంచుకున్నా. ఒక్కొక్క గజ్జెల లాగు తయారు చేయడానికి ఐదు రోజుల నుంచి వారం రోజుల సమయం పడుతుంది. చేతి పని ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇదే జీవనాధారం ఆదాయం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ దేవుడిపై భక్తితో ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. – బుర్ర రవీందర్, నడికూడ
20 ఏళ్లుగా వస్తున్నాను..
ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది. – రామ్మూర్తి, కేసముద్రం
కొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు.
ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడి
ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడి
Comments
Please login to add a commentAdd a comment