నష్టపోతున్న ‘ఇసుక మేట’ బాధిత రైతులు
ప్రకృతి వైపరీత్యాలతో వరదలు ఉప్పొంగి పంటలు సాగు చేసే భూముల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో కొన్నేళ్లుగా పంటలు పండించుకునే పరిస్థితి లేకపోవడంతో అటు కౌలు రాక, ఇటు పంటలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇసుక మేటలను తొలగించడానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో సంవత్సరాల తరబడి మేటలు పొలాలను కప్పి ఉన్నాయి. ఇసుక మేటలు వేసి పంటలు పండక రైతులు ఒకవైపు నష్టపోతుంటే, ఇసుక భూములకు రైతు భరోసా తొలగిస్తున్నామని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఇసుక మేటలు వేసిన భూముల్లో సర్వే చేస్తున్న అధికారులు(ఫైల్)
మండలాల వారీగా తొలగింపు
వివరాలు (ఎకరాల్లో..)
ఏటూరునాగారం 49.36
గోవిందరావుపేట 28.05
కన్నాయిగూడెం 24.18
మంగపేట 152.39
ములుగు 1087.02
తాడ్వాయి 252.25
వెంకటాపురం(ఎం) 61.27
వెంకటాపురం(కె) 98.14
వాజేడు 140.31
Comments
Please login to add a commentAdd a comment