వాజేడు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తాళ్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మండల పరిధిలోని పేరూరు పీహెచ్‌సీకి మలేరియా మందులను పంపిణీ చేశారు. వాజేడు మండలంలో మలేరియా జ్వరాల తీవ్రత లేకపోవడంతో మలేరియా మందులు రావడం లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన కూలీలకు మలేరియా జ్వరాలు ఉంటుండటంతో వారికి వైద్యం అందించడానికి ఇబ్బందులు తలెత్తు తున్నాయి. పేరూరు వైద్యశాల పరిధిలో వలస కూలీలు సుమారుగా 5వేల మంది వరకు ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ వివరాలను అంతర్రాష్ట్ర ఆస్పత్రుల సమన్వయంలో భాగంగా పేరూరు హెచ్‌ఈఓ వేణుగోపాల కృష్ణ సరిహద్దున ఉన్న తాళ్లగూడెం ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి సత్యనారాయణకు సమస్యను వివరించగా ఆయన స్పందించి మందులను అందించారు.


