ములుగు: జిల్లాకేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో కాంప్లెక్స్ వ్యాపారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం డీఎస్పీ నలువాల రవీందర్ ప్రారంభించారు. ఎస్సై వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎండత తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లాకేంద్రానికి రోజువారీగా వచ్చే ప్రయాణికులు, వస్తువుల కొనుగోలుకు వచ్చే వారు, పోలీస్ స్టేషన్ పనుల నిమిత్తం వచ్చే వారికి చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎండాకాలం పూర్తి అయ్యేంత వరకు చలివేంద్రాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాట్ల బద్రి, రియాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


