వాజేడు: మండల కేంద్రంలోని అన్నపూర్ణ విశ్వేశ్వరస్వామి దేవాలయంలోని విగ్రహాలను బుధవారం గ్రామస్తులు గోదావరి జలాలతో శుద్ధి చేశారు. శివాలయం పునఃప్రతిష్టించాలని గ్రామస్తులు ధర్మకర్తతో కలిసి ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆలయంలోని విగ్రహాలపై దుమ్ముధూళి చేరి ఉంది. గుడి పునఃప్రతిష్ఠాపనకు ముందే ఆలయాన్ని శుద్ధి చేయాలని పూజారి సలహా మేరకు గ్రామంలోని మహిళలు బిందెలతో గోదావరి జలాలను తీసుకొచ్చి విగ్రహాలను శుద్ధి చేశారు.
రామప్పను సందర్శించిన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ గిరిబాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆనంతరం రామప్ప సరస్సుకు చేరుకొని బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. ఆయన వెంట ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, నాయకులు ఉన్నారు.
సెలూన్ షాపుల బంద్
సంపూర్ణం
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్‌తో పాటు కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా నాయీబ్రాహ్మణులు బుధవారం చేపట్టిన సెలూన్ షాపుల బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థలో వెనక్కి తగ్గకుంటే రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతంచేస్తామన్నారు. నాయీబ్రాహ్మణులకు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దుబ్బాక సంపత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ గిరి సమ్మయ్య, మండల అధ్యక్షుడు మంతెన భూమయ్య, నాయకులు వంగపల్లి సుదర్శన్, మురహరి శంకర్, జంపాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణపల్లి ఆరోగ్య కేంద్రానికి జాతీయస్థాయి సర్టిఫికెట్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధి బ్రాహ్మణపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి జాతీయ ప్రమాణాల సర్టిఫికెట్ గుర్తింపు లభించినట్లు వైద్యాధికారి డాక్టర్ సుప్మిత తెలిపారు. బుధవారం జాతీయ ఆరోగ్య వ్యవస్థ వనరుల కేంద్రం, జాతీయ హెల్త్ మిషన్ మినిస్ట్రీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో ఏడు జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ ఎస్సెస్‌మెంట్‌లో భాగంగా బ్రాహ్మణపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు లభించింది. మార్చి 10న ఎన్‌హెచ్‌యూఆర్‌సీ, ఎన్‌ఆర్‌ఎం ఇండియా అధికారులు వర్చువల్‌గా ఆరోగ్య ప్రమాణాలు, పబ్లిక్ హెల్త్ స్కీం ఫెసిలిటీని పరిశీలించిన విషయం విధితమే. జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో డీఎంహెచ్‌ఓ మధుసూదన్ ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు.
గోదావరి జలాలతో విగ్రహాల శుద్ధి
గోదావరి జలాలతో విగ్రహాల శుద్ధి