ఏటూరునాగారం: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. మండల పరిధిలోని అభయారణ్య ప్రాంత సందర్శనలో భాగంగా గురువారం అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన వనదర్శిని కార్యక్రమానికి వరంగల్ జవహర్ నవోదయ విద్యార్థులు రాగా వారికి అడవుల సంరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణకు అటవీశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అడవుల్లో సంచరించే జంతువులకు వేసవిలో నీటి వసతికి అడవుల్లో అక్కడక్కడా నీటి సాసర్ బెడ్స్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అడవులు అగ్నికి కాలిపోకుండా తీసుకుంటున్న చర్యలతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్