ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
మంగపేట: ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఐకేపీ(సెర్ప్) ఆడిషనల్ డీఆర్‌డీఓ బాలరాజు అన్నారు. మండల పరిధిలోని తిమ్మంపేట, కమలాపురం, గంపోనిగూడెం, తిమ్మంపేటలో ఆయా గ్రామాల గ్రామైఖ్య సంఘాల సభ్యులకు కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు. స్థానిక కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.2,320, దొడ్డురకం ధాన్యం క్వింటాకు రూ. 2,300 ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. ఽసన్నరకం ధాన్యం క్వింటాకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా చెల్లిస్తుందన్నారు. కొనుగోలు విషయంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
ఐకేపీ అడిషనల్ డీఆర్‌డీఓ బాలరాజు


