ఉపాధి లక్ష్యంగా..
రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగుల దరఖాస్తులు
మంగపేట: నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు నిరుద్యోగులకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆయా యూనిట్ విలువను బట్టి 100నుంచి 70శాత సబ్సిడీ మంజూరును ప్రకటించింది. దీంతో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఉపాధి కోసం వివిధ రకాల యూనిట్లకు దరఖాస్తులు వెల్లువలా చేసుకుంటున్నారు. తొలుత మార్చి 31వ తేదీ వరకు చివరి గడువు ప్రభుత్వం విధించింది. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగించింది.
మీ సేవ కేంద్రాలకు బారులు
జిల్లాలోని 10మండలాల్లో మీ సేవ కేంద్రాలకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు కోసం నిరుద్యోగులు బారులు తీరుతున్నారు. వందల సంఖ్యలో నిరుద్యోగులు వస్తుండడంతో సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా సర్టిఫికెట్లు పొందిన నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకం పొందేందుకు ఆన్‌లైన్ చేసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. భారీగా నిరుద్యోగులు వస్తుండడంతో రూ.100 నుంచి 150వసూలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా..
దరఖాస్తుల స్వీకరణ గడువు
ఈ నెల 14వరకు పెంపు
సర్టిఫికెట్ల కోసం
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఉపాధి లక్ష్యంగా..


