ప్రభుత్వవైద్యంపై నమ్మకం కలిగించాలి
ములుగు: ప్రభుత్వవైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రి సమీక్ష సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి శుక్రవారం వైద్యులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించి భరోసా ఇవ్వాలని అన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడుతూ సానుకూలంగా స్పందించాలని అన్నారు. ప్రభుత్వ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని అన్నారు. ములుగు, ఏటూరునాగారం ఆస్పత్రుల్లో వైద్యులు 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వైద్య సిబ్బంది జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. ప్రతి మండలంలో 108 వాహనం ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని పరిస్థితిని తెలుసుకోవాలని అన్నారు.కీ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, వైద్యులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క
పలువురికి మంత్రి పరామర్శ
గోవిందరావుపేట: మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, వారి కుటుంబాలను మంత్రి సీతక్క శుక్రవారం పరామర్శించారు. మండల పరిధిలోని అమృతండా గ్రామంలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న బానోత్ సమ్మయ్య, ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొద్దులగూడెం గ్రామానికి చెందిన బర్ల లక్ష్మారెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట పార్టీ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, నాయకులు ఉన్నారు.
ప్రభుత్వవైద్యంపై నమ్మకం కలిగించాలి
ప్రభుత్వవైద్యంపై నమ్మకం కలిగించాలి


