లీకేజీలను గుర్తించిన ఇంజినీర్లు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజినీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నీటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్‌లోకి దిగిన మెగా ఇంజినీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు.
టన్నెల్‌లోకి దిగిన మెగా సిబ్బంది


