రాజ్యాంగంపై అవగాహన పెంచడమే లక్ష్యం
భూపాలపల్లి రూరల్/ రేగొండ: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రం, కొత్తపల్లిగోరి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పలు వురు మేధావుల ఆలోచనలతో ఏర్పడిన పవిత్ర గ్రంథామన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, దుగ్యాల రాజేశ్వరరావు, చిగురుమామిడి కుమార్, వెంకటేష, వీరబ్రహ్మం, శ్రీని వాస్, ప్రభాకర్, సంతోష్ రాజయ్య, పాల్గొన్నారు.
నాపాక ఆలయం సందర్శన
చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలో వెలిసిన నాపాక శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు. అనంతరం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొని పూజలు చేశారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని కళాకారులకు బహుమతులు అందజేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రాజ్యాంగంపై అవగాహన పెంచడమే లక్ష్యం


