ఆధార్‌లోని పేర్లు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సరిపోలక ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌లోని పేర్లు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సరిపోలక ఇబ్బందులు

Apr 10 2025 1:24 AM | Updated on Apr 10 2025 1:24 AM

ఆధార్

ఆధార్‌లోని పేర్లు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సరిపోలక ఇబ్బందులు

జిల్లాలో ఇప్పటి వరకు 61.9శాతం నమోదు అపార్‌తో ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలు నిక్షిప్తం

ములుగు రూరల్‌: ప్రతీ విద్యార్థికి అపార్‌(ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న రెండో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియను అధికారులు చేపట్టారు. విద్యార్థుల వివరాల నమోదు సమయంలో తలెత్తుతున్న సమస్యల కారణంగా లక్ష్యం చేరుకోలేక పోతున్నారు. విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకేచోట నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన అపార్‌ నమోదులో పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు తదితర తప్పిదాల కారణంగా అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయడం సాధ్యం కాకపోవడంతో నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు.

ఆధార్‌– యూడైస్‌ వివరాల్లో తేడా..

అపార్‌ నమోదులో ప్రధానంగా పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన వివరాలతో పాటు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. యూడైస్‌లో విద్యార్థుల వివరాలు ఇప్పటికే ఉన్న విద్యార్థుల పర్మనెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ వివరాలకు ఆధార్‌ వివరాలు సరిపోలకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది విద్యార్థుల వ్యక్తిగత వివరాలకు ఆధార్‌ వివరాల్లో తేడాలు ఉండడంతో ఆధార్‌ కార్డులో పేరు మార్పు, అక్షరాల తప్పులను సరి చేయాల్సి వస్తోంది. ఆధార్‌ వివరాలను సరిచేయడం కోసం ధ్రువీకరణ పత్రాలను జత చేయడం తప్పనిసరిగా మారింది. ఈ విషయంలో టెన్త్‌ మార్కుల మెమో, బోనోఫైడ్‌తో పాటు జనన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆధార్‌కార్డులో మార్పులు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల వివరాలు, అంగీకార పత్రాలు సకాలంలో అందించకపోవడంతో అపార్‌ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది.

61.9శాతం పూర్తి

జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఇప్పటి వరకు అపార్‌ నమోదు 61.9శాతం పూర్తి అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 42,486 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 30,523 మంది విద్యార్థులు ఉండగా ప్రైవేటు పాఠశాలల్లో 11,963 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు అపార్‌ నమోదు 18,709 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 7,594 విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదు అయ్యాయి. జిల్లాలో ఆధార్‌ కార్డుల్లో పేర్లు తప్పుగా నమోదైన విద్యార్థులు 6,125, పుట్టిన తేదీ సరిపోలక 5,513, లింగబేధంతో 1,231, విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకార పత్రాలు ఇవ్వకుండా ఉన్న 4,817 మంది విద్యార్థులను విద్యాశాఖ గుర్తించింది.

జిల్లాలోని విద్యార్థుల వివరాలు

మండలం విద్యార్థుల అపార్‌

సంఖ్య నమోదు

ములుగు 11,636 6,743

వెంకటాపురం(ఎం) 3,465 2,130

గోవిందరావుపేట 4,362 2,867

ఎస్‌ఎస్‌తాడ్వాయి 3,233 2,011

ఏటూరునాగారం 5,554 2,969

మంగపేట 5,760 4,073

కన్నాయిగూడెం 1,427 887

వెంకటాపురం(కె) 4,495 2,686

వాజేడు 2,554 1,937

ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి

అపార్‌ నమోదు ప్రతీ విద్యార్థి తప్పని సరిగా చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 61.9శాతం నమోదు పూర్తి అయింది. విద్యార్థుల ఆధార్‌ వివరాలు సరిపోలక ఆలస్యం అవుతోంది. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ అంగీకార పత్రాలు ఇవ్వలేదు. అపార్‌తో విద్యార్థుల పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తంగా ఉంటాయి. ప్రభుత్వాలు అందించే స్కాలర్‌షిప్‌లు నేరుగా అందేందుకు వీలుంటుంది.

– పాణిని, జిల్లా విద్యాశాఖ అధికారి

ఆధార్‌లోని పేర్లు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సరిపోలక ఇబ్బందులు1
1/1

ఆధార్‌లోని పేర్లు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సరిపోలక ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement