‘ప్రజావాణి’కి 45 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 45 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ ఫిర్యాదులు స్వీకరించి.. ఆయా శాఖలకు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 11..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 11 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో తగు న్యాయం గురించి 3, భూమి పంచాయతీ 7, భార్యాభర్తల గొడవ ఫిర్యాదు 1 వచ్చినట్లు చెప్పారు.
రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు
బిజినేపల్లి: ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవడం వలన వారు ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారని, అంతేకాక ఆ పథకాలను సద్వినియోగం చేసుకుని సరైన ఆచరణలో పెట్టాలని పాలెం కేవీకే సమన్వయకర్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ఆడిటోరియంలో కిసాన్ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోడీ కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మాట్లాడిన అనంతరం కేవీకే సమన్వయకర్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలైన పప్పు ధాన్యాల పంటలలో ఆత్మనిర్భరత, అధిక సాంధ్రత పత్తి సాగు, భూసార పరీక్షా పత్రాల పథకం, ఎరువుల సబ్సిడీ వంటివి సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అనంతరం మద్రాస్ ఫర్టిలైజర్స్ మేనేజర్ ఉమాశంకర్ సమతుల్య ఏరువుల యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్, పాలెం కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
శ్రీశైల మల్లన్నకు
పట్టువస్త్రాలు
అమరచింత: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పట్టణ పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పట్టువస్త్రాలను సోమవారం మహంకాళి శ్రీనివాసులు, సవితారాణి దంపతులు ఆలయ ఈఓకు అందజేశారు. పద్మశాలి భవన్‌లో పట్టువస్త్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం తలపై పెట్టుకొని మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసి ఆలయ ఈఓకు సమర్పించారు. వీటిని శివరాత్రి రోజున స్వామి, అమ్మవారికి అలంకరిస్తారు. కార్యక్రమంలో పద్మశాలి సత్రం కమిటీ సభ్యుడు కర్నాటి శ్రీధర్, మహంకాళి సత్యనారాయణ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
‘త్రివేణి సంగమ
జలాలు పవిత్రం’
వనపర్తిటౌన్: త్రివేణి సంగమంలోని జలాలు పరమ పవిత్రమని ప్రముఖ గురువు ఆదిత్యా పరాశ్రీ స్వామిజీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పెంటగాన్ సమీపంలో కుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాల సంప్రోక్షణ కార్యక్రమం పోచ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుంభమేళాకు వెళ్లలేని వారికి ఈ పవిత్ర జలాలు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపపట్టినట్లు వివరించారు. సజ్జన సాంగత్యంతోనే ధర్మమార్గానికి బాటలు పడతాయని.. సజ్జనులు కుంభమేళా జలాలు ప్రతి ఒక్కరికి చేరేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జీజే శ్రీనివాసులు, వామన్‌గౌడ్, కేవీ రమణ, సదానందగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ప్రజావాణి’కి 45 ఫిర్యాదులు
‘ప్రజావాణి’కి 45 ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment