అచ్చంపేట రూరల్: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన బీటీఎఫ్ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాన్ని చైతన్యం చేయడానికి, మూఢ నమ్మకాలు, అన్ని వివక్షతలకు వ్యతిరేకంగా, జ్ఞాన సమాజం కోసం పని చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగం సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల మండలాల కమిటీలను ఏర్పాటు చేశారు. సమావేశంలో రవీందర్, కరుణాకర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment