సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవా ల్‌గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచి క్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటి కి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. వాస్తవానికి టన్నెల్ బో రింగ్ మెషీన్ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment