మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజులుగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివెళ్తుండటంతో నల్లమల కొండలు జనసంద్రంగా మారాయి. ఉమామహేశ్వరం, భౌరాపూర్, శ్రీశైలం క్షేత్రాలకు వెళ్లే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, 120 మంది పోలీసులను నియమించారు. అదే విధంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, ఈగలపెంటలలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. పాతాళాగంగ వద్ద 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉన్నారు. అత్యవసర పరిస్థితిల్లో రోగులను తరలించేందుకు రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment