దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌మార్‌రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment