సొరంగం ఘటన జరిగిన రోజు నుంచి రెండు, మూడు హెలిక్యాప్టర్లు వచ్చిపోతున్నాయి. జేపీ కంపెనీ కార్యాలయం వద్ద ఒకటి నిలిచేందుకు హెలీప్యాడ్ ఉంది. ఒకటి వస్తే మరొకటి గాలిలో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో సున్నిపెంట, శ్రీశైలం వెళ్లి ల్యాండ్ అవుతున్నాయి. బుధవారం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలిక్యాప్టర్‌లో రాగా.. జేపీ కంపెనీ అధినేత జయప్రకాశ్‌గౌర్ మరో హెలిక్యాప్టర్‌లో వచ్చారు. ఒక హెలీప్యాడ్ మాత్రమే ఉండటంతో దిగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరొకటి గాలిలోకి ఎగరాల్సి వచ్చింది. దీంతో హుటాహుటిన మరో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment