కనిపించని పురోగతి
అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్‌లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం భగీరథ యత్నం
నీటిని, బురద తొలగించడం పెద్ద సవాలే..
రెండు రోజుల్లో
తీసుకు వస్తామన్న మంత్రులు
కనిపించని పురోగతి
Comments
Please login to add a commentAdd a comment