రెండేళ్లలో ఉమామహేశ్వరం ప్రాజెక్టు పూర్తి
బల్మూర్: ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ప్రాజెక్టు పనులను గురువారం ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2.5 టీఎంసీలకు తగ్గించామని తెలిపారు. ఫేజ్–1లో రూ.1,534 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుంద న్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయభాస్కర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment