లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రైవేట్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తామన్నారు. విహాన స్కానింగ్ సెంటర్, శ్రీ సత్యసాయి నర్సింగ్ హోంలోని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన గర్భిణుల స్కానింగ్ వివరాలు, ఫారం–ఎఫ్‌ల రికార్డులు, స్కానింగ్ మిషన్ వివరాలను సేకరించారు. లింగ నిర్ధారణ చట్టం గురించి తెలిపే బోర్డులను పరిశీలించి, స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు లింగ నిర్ధారణ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారు, చేయించుకున్న వారు, ప్రోత్సహించిన వారు గర్భ నిర్ధారణ నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని, గర్భ నిర్ధారణ నిరోధక చట్టం అమలుకు వైద్యులు ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట డీపీఓ రేణయ్య, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment