ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులపై రైతుల ఫిర్యాదు
బల్మూర్: కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఉమామహేశ్వర ప్రాజెక్టు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం భూ నిర్వాసిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును పరిశీలించిన ఎస్‌ఐ రమాదేవి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వస్తుందని తిరస్కరించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసిత రైతు కమిటీ నాయకులు సీతారాంరెడ్డి, తిరుపతయ్య, ఇంద్రారెడ్డి తదితరులు స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తే నాలుగు గ్రామాల రైతుల భూములు కోల్పోతామని కోర్టును ఆశ్రయించగా నిర్వాసితులకు పరిహారంతోపాటు పిసా చట్టం ప్రకారం ఏజెన్సీ గ్రామమైన బల్మూర్‌లో ఎస్సీ, ఎస్టీ రైతులకు పునరావాసం కల్పించి పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు. కానీ, భూ సేకరణ చేయకుండా, రైతులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు నిలిపి వేయకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడమని తేల్చిచెప్పారు.
కోర్టు పరిధిలో తేల్చుకోవాలని
తిరస్కరించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment