సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. శనివారం ఉదయం సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్‌రన్ నిర్వహించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించారు. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్‌ఐలు, 140 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంకార్డులు విధుల్లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment