రమణీయం.. ఆది దంపతుల కల్యాణం
నాగర్‌కర్నూల్‌రూరల్: మండలంలోని కుమ్మెర గట్టుపై స్వయంభూ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుమ్మెర గట్టు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పండితుడు పట్నం సురేశ్ శర్మ ఆధ్వర్యంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి.. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. భక్తజనంతో కుమ్మెర గట్టు కిక్కిరిసిపోయింది. స్వామివారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment