
గుడుంబాపై ఉక్కుపాదం
జిల్లాలో మళ్లీ పుంజుకుంటున్న సారా తయారీ, విక్రయాలు
వేరుశనగ @రూ.6,409
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటాల్ అత్యధికంగా రూ.6,409, కనిష్టంగా రూ.4,309, సరాసరిగా రూ.5,899 ధర లభించింది. మార్కెట్‌కు గురువారం 60 మంది రైతులు సుమారు 330 క్వింటాళ్ల వేరుశనగను తీసుకొచ్చారని మార్కెట్ కార్యదర్శి చెప్పారు.
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. ఎప్పటిలాగే నిషేధిత సారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలో గుడుంబా కట్టడికి ఎకై ్సజ్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎకై ్సజ్, పోలీస్ శాఖలు సారా తయారీ, విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి.. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కట్టడికి కృషిచేస్తున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో సారా తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలిస్తున్నారు.
ఇటీవల ఘటనలు..
● జనవరి 18న లింగాల, కల్వకర్తి, కోడేరు మండలాల్లో ఎకై ్సజ్‌శాఖ దాడులు నిర్వహించి పెద్దమొత్తంలో సారా, బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు.
● జనవరి 21న కొల్లాపూర్ మండలంలో 20 లీటర్ల సారా, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
● మార్చి 18న లింగాలలోని 14వ వార్డులో ఎకై ్సజ్‌శాఖ అధికారులు దాడులు చేసి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
● మార్చి 19న లింగాలలోనే 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
● మార్చి 23న లింగాల మండలంలోని క్యాంపు రాయవరంలో దాడులు జరిపి 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
● మార్చి 26న బల్మూరులో సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 4 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
బతుకుదెరువు చూపినా..
గతంలో సారా తయారీ, విక్రయదారులకు ఎలాంటి ఉపాది మార్గాలు లేక సారా తయారీ మార్గాన్ని ఎంచుకున్నారు. వీరి కోసం 2017–18 సంవత్సరంలో దాదాపు 300 మందిని ఆ వృత్తిని మానిపించేందుకు కొందరికి ఆటోలు, పాడిపశువుల కోసం రూ.2 లక్షలు ఇచ్చి బతుకుదెరువు చూపించింది. ప్రస్తుతం వారిలో చాలా మంది మళ్లీ సారా తయారీపై వైపు మొగ్గు చూపుతుండటం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అడ్డుకట్టకు చర్యలు చేపడుతున్నారు.
2024–25లో నమోదైన కేసులు 1,232
అరెస్టు అయిన వారు 934
స్వాధీనం చేసుకున్న సారా 6,802 లీటర్లు
పట్టుబడిన
నల్లబెల్లం, స్పటిక 62,604 కిలోలు
ధ్వంసం చేసిన
బెల్లం పాకం
1,81,010 లీటర్లు
సీజ్ చేసిన వాహనాలు 205
ఇటీవల వరుస దాడులతో
భారీ స్థాయిలో బెల్లం పట్టివేత
కట్టడికి ప్రత్యేక చర్యలు
చేపట్టిన ఎకై ్సజ్‌శాఖ
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎకై ్సజ్‌శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నాం. సారా తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– గాయతి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్

గుడుంబాపై ఉక్కుపాదం