
ఈద్గాలు ముస్తాబు..
కందనూలు: షవ్వాల్ నెలవంక ఆదివారం సాయంత్రం దర్శనమివ్వడంతో ముస్లింలు 30 రోజులపాటు చేపట్టిన ఉపవాస దీక్షలు విరమించారు. సోమవారం రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్)ను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ కొత్త దుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్దకు ఉదయం 8 గంటలకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తాగునీరు, నీడ వసతి కల్పించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో పాటు పలు పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఈద్గా పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా ఆదివారం కిరాణం, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
నేడు ఈద్–ఉల్–ఫితర్
దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంక
ముగిసిన ఉపవాసదీక్షలు

ఈద్గాలు ముస్తాబు..