
స్వర్ణాభరణాలంకరణలో వేంకటేశ్వరుడు
స్వర్ణాభరణాలంకరణలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ధగధగా మెరిసిపోతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. విశేషోత్సవాల్లో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తుండగా.. ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజు స్వామివారిని స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. శ్రీరామ నవమి వరకు స్వామివారికి ఈ అలంకరణ ఉంటుంది. దీంతో వారం రోజుల పాటు స్వామివారు స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరించారు.
– మహబూబ్‌నగర్ రూరల్