గుట్ట ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణంలో భాగంగా కొండపైన చేపట్టిన అభివృద్ధి పనులను ఆర్‌అండ్‌బీ క్యూసీ సీఈ మోహన్‌నాయక్, పుల్లారావుల బృందం బుధవారం పరిశీలించింది. సీఎం రేవంత్ ఇటీవల ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా వైటీడీఏతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకుపూర్తయినవి, పెండింగ్ పనుల వివరాలను తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యం అధికారుల బృందం ప్రధానాలయం, మాఢ వీధులు, తిరు వీధులు, బస్టాండ్, కమాండ్ కంట్రోల్ భవనం, పార్కింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. పూర్తయిన పనులు, చెల్లించిన బిల్లులు, పెండింగ్ బిల్లుల వివరాలు తెలుసుకున్నారు. నివేదికను ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులు పరిశీలించిన వారిలో ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఎండీఎ సీఈ పరంజ్యోతి, ఎస్‌ఈ వసంత్‌నాయక్, క్యూసీ ఎస్‌ఈ సుదర్శన్‌రెడ్డి, వైటీడీఏ అధికారులు ఉన్నారు.


