ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి

Mar 27 2025 2:07 AM | Updated on Mar 27 2025 2:07 AM

ఎస్సీ

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి

నల్లగొండ: జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రేమ్‌కరణ్‌రెడ్డి నియమితులయ్యారు. జిల్లా పరిషత్‌ సీఈఓగా పనిచేస్తున్న ప్రేమ్‌కరణ్‌రెడ్డికి జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆయన ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు స్వీకరించారు.

పదో తరగతి పరీక్షకు 29 మంది గైర్హాజరు

నల్లగొండ: జిల్లాలో 105 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం గణితం పరీక్షకు మొత్తం 18,666 మంది విద్యార్థులకు గాను, 18,637 మంది హాజరయ్యారు. 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ భిక్షపతి తెలిపారు.

దేవరకొండ ఆసుపత్రిలో కాయకల్ప బృందం

దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన కాయకల్ప బృందం సందర్శించింది. డాక్టర్‌ ప్రభు నేతృత్వంలోని బృందం సభ్యులు ఇన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్‌, డయాలసిస్‌, మాతా శిశుసంరక్షణ కేంద్రం, జనరల్‌ ఓపి, మెటర్నటీ, ఎమర్జెన్సీ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, పరిశుభ్రత, నిర్వహణ, సిబ్బంఇ వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ బృందం అందించే నివేదిక ప్రకారం ఆసుపత్రిని కాయకల్ప అవార్డుకు ఎంపిక చేయనున్నారు. వారివెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌, వైద్యులు కృష్ణ, రంజిత్‌, సిబ్బంది ఉన్నారు.

గోదాముల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలి

నల్లగొండ టౌన్‌: ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణానికి సబ్సిడీల సదుపాయం కల్పించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం తమిళనాడు రాష్ట్రం చైన్నెలోని ఎఫ్‌సీఐ రీజనల్‌ కార్యాలయంలో సౌతిండియా ఎఫ్‌సీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జెజింత లాజరస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాముల నిర్మాణం వల్ల రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకుని ధర ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకుని లాభాలు ఆర్జించడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. రైతులు దళారీల బారిన పడకుండా మద్దతు ధర పొందే అవకాశం ఉంటుందని ఈడీకి వివరించారు.

మెరుగైన వైద్యం అందించాలి

చిట్యాల: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌, డ్రగ్స్‌ స్టోర్‌, స్టాక్‌ రిజిస్టర్‌, కాన్పుల రూమ్‌ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆసుపత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, పిల్లలకు సకాలంలో టీకాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఉబ్బు నర్సింహ, సీహెచ్‌ఓ కల్యాణచక్రవర్తి, హెల్త్‌ సూపర్‌వైజర్‌లు శ్యామల, లక్ష్మి, వీరారెడ్డి, స్టాప్‌ నర్స్‌ ప్రసన్నకుమారీ, ఫార్మాసిస్ట్‌ హేమ, వైద్య సిబ్బంది వరలక్ష్మి, త్రివేణి, లక్ష్మి, పద్మావతి, మహేందర్‌, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి1
1/3

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి2
2/3

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి3
3/3

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement