నల్లగొండ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Mar 28 2025 1:55 AM | Updated on Mar 28 2025 1:51 AM

రామగిరి (నల్లగొండ) : నల్లగొండ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీతో ఇతర పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఏప్రిల్‌ 4వ తేదీన ఓటింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి కమిటీలను ప్రకటించనున్నారు.

రెన్యువల్‌ చేసుకోవాలి

నల్లగొండ : జిల్లాలోని ప్రైవేట్‌ డీఈడీ కాలేజీ యాజమాన్యాలు 2025–26 విద్యా సంవత్సరం నుంచి 2028–29 విద్యా సంవత్సరానికి రెన్యువల్‌ చేసుకోవాలని డైట్‌ ప్రిన్సిపాల్‌ నర్సింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.లక్ష డీడీ లేదా బ్యాంకు చెక్కు రూపంలో ద చైర్‌పర్సన్‌ ఆప్‌ ద అఫిలియేషన్‌ కమిటీ అండ్‌ ద డీఎస్‌ఈ తెలంగాణ హైదరాబాద్‌ పేరున చెల్లించాలని సూచించారు. చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ప్రతిపాదనలు ఈ నెల 31లోగా ఎస్‌సీఈఆర్‌టీ హైదరాబాద్‌ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే

ప్రభుత్వం లక్ష్యం

హాలియా : రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. హాలియా వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహిస్తున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. కందుల మార్కెట్‌ను ఉపయోగించుకొని ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర క్వింటా రూ.7550 పొందారని ఆయ సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డిని మార్కెట్‌ చైర్మన్‌ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కాకునూరి నారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, గౌనీ రాజా రమేష్‌యాదవ్‌, కోట నాగిరెడ్డి, మార్కెట్‌ సూపర్‌వైజర్‌ ఖలీల్‌, సిబ్బంది సత్యనారాయణ, రామాంజి, సురేష్‌ తదితరులు ఉన్నారు.

ఏప్రిల్‌ 4 వరకు పింఛన్ల పంపిణీ

నల్లగొండ : ఆసరా పింఛన్లను ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు పింఛన్లను ఆయా పోస్టాపీస్‌లలో అందజేయనున్నట్లు తెలిపారు.

మెరిట్‌లిస్ట్‌ విడుదల

నల్లగొండ టౌన్‌ : కాంట్రాక్టు పాలియేటివ్‌ కేర్‌ స్టాఫ్‌నర్సు పోస్టుల నియామకాల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను డీఎంహెచ్‌ఓ కార్యాలయం నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌ www.nalgonda. nic.inలో ఉంచినట్లు సిబ్బంది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే 29లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో రాత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement