హుజూర్‌నగర్: ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 30న హుజూర్‌నగర్‌లో జరగనున్న సీఎం సభా స్థలి ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు నీడ ఉండేలా హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మజ్జిగ ప్యాకెట్లు, చల్లని తాగునీరు అందించాలన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడాలన్నారు. పార్కింగ్ స్థలాలకు అప్రోచ్ రోడ్లు శుక్రవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేసారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభానికి లబ్ధిదారులను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం లెడ్ స్క్రీన్‌లను ప్రజలు తిలంకించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్‌డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, వేణుమాధవరావు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


